అసలు ఈ బ్లాగ్ వ్రాస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. చిన్నప్పటి నుండి నాకు పుస్తకాలు చదవడం బాగా అలవాటు. అందరి లాగే నేనూ, మనం కూడా ఒక పుస్తకం వ్రాయాలి అని అనుకునేవాడిని. సరే మొదలుపెడితే పోలా అని మొదలుపెట్టేసాను. ఓపిక ఉంటే చదవండి. ఈ బ్లాగ్ 2010లో మొదలుపెట్టాను. అప్పుడు చాలా డిప్రషన్‌లో ఉన్నాను. నా ఆవేదనను మరచిపోవడానికి, నేను ఆనందంగా గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ ఇది రాసాను.
1983 ఆగస్ట్ 6 న కొత్తగూడెం బస్ స్టాండ్ లో, ఉదయం 9.30 కి ఇల్లందు నుండి వచ్చిన బస్సు లో నుండి దిగాను. సిగరెట్ పెట్టి కొనుక్కొని బయటకు వచ్చి Singareni హెడ్ ఆఫీసు కి దారి అడిగి, నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాను. ఆ రోజు ఉదయమే కాకినాడ నుండి మా చిన్నాన్న ఉంటున్న ఇల్లందు వచ్చి, కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి కొత్తగూడెం వచ్చాను. ఇప్పటిదాకా రెండు ఉద్యోగాలు కాకినాడ లోనే చేసాను. కాకపోతే మొదటినుండి ఉద్యోగం చెయ్యడం నాకు ఇష్టం లేదు. అందుకనే ఈ ప్లాన్ వేసాను. ఎందుకంటే నేను ఒక్కడినే కొడుకుని.నాకు ఇద్దరు అక్కలు. పెద్ద అక్కకు పెళ్లి అయ్యి మండమర్రిలో ఉంటోంది.బావగారు ఇదే Singareni లో ఏ.ఇ గా చేస్తున్నారు.నేను ఇంత దూరంలో వుంటే, నా గురించి మా అమ్మ బెంగపెట్టుకొని ఉద్యోగం మానిపించేస్తుంది అని ఒక వెదవ ఆలోచన. నడుస్తున్నానన్నమాటే గాని నా ఆలోచనంతా, కాకినాడ ఎప్పుడు వెళ్లుతానా అనే. ఎందుకంటే ఆ ముందు రోజు బస్సు ఎక్కేముందు, మా ఫ్రెండ్ లవర్ దగ్గర మాట తీసుకొన్నాను. నేను ఈ సారి కాకినాడ వచ్చినప్పుడు తను మా ఫ్రెండ్ని పెళ్లి చేసుకొనేది, లేనిది చెప్పాలని.
అప్పుడే రెండు సిగరెట్లు కాల్చేసాను.దూరంగా పెద్ద గేటు కనిపించింది. ఓహో ఇక్కడే అన్నమాట మనం ఉద్యోగం చెయ్యబోయేది అనుకొన్నాను. కొద్దిగా ఎగ్సైట్మెంట్. గేటు దగ్గర సెక్యూరిటీ గార్డ్ వున్నాడు. అక్కడ ఆగి అతన్ని సివిల్ సి.ఇ.ఆఫీసు ఎక్కడ అని అడిగాను. వెనకాల వుంది వెళ్ళమన్నాడు. ముందు పెద్ద బిల్డింగ్. దాని వెనకాల మా సివిల్ ఆఫీసు. లోపల డి.వై.సి.ఇ.గారి ఆఫీసు లోకి వెళ్లి, నేను కొత్తగా జాయిన్ అవ్వడానికి వచ్చిన ఓవర్సీర్ ని అని చెప్పి ఎవరి దగ్గర రిపోర్ట్ చెయ్యాలి అని అడిగా. ఈలోగానే నా కళ్ళు అక్కడ ఎవరైనా అమ్మాయిలు వున్నరేమోనని స్కాన్ చేసేసాయి. వాళ్ళు డి.వై.సి.ఇ గారి రూము చూపించారు. అప్పుడు శ్రీ.వెంకట రత్నం గారు మాకు డి.వై.సి ఇ.గా చేస్తున్నారు. ఈ లోపు అక్కడే నాలా కొత్తగా జాయిన్ అవ్వడానికి, వరంగల్ నుండి వచ్చిన ఉపేంద్ర కలిసాడు.ఇద్దరం వెళ్లి డి.వై.సి.ఇ గార్ని కలిసాము. నా జీవితంలో నేను కలిసిన గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయన మా గురించి అన్ని విషయాలు అడిగి, మీరు ఇప్పుడు చిన్నవాళ్ళు, ఈ ఫీల్డ్ లో వ్యసనాలు తొందరగా అలవాటు అవుతాయి, వాటి జోలికి వెళ్ళకండి అని చెప్పారు. నేను అప్పుడే రెండు సిగరెట్లు కాల్చి వచ్చానేమో, ఆయనకు ఎక్కడ వాసన వస్తుందో అని కంగారుపడ్డాను. ఈ లోగా ఆయనే, సరే ఒక రెండు రోజులు ఇక్కడకే రండి, మీరు ఎక్కడ చేయాలో అప్పుడు చెబుతాను అన్నారు. హమ్మయ్య అనుకోని బయటకు వచ్చాము. నా కళ్ళు వెంటనే వాటి పని అవి చెయ్యడం మొదలు పెట్టేయి. ఒక అమ్మాయి కనిపించింది. పరవాలేదు కలర్ ఉందిలే అనుకొన్నాను. ఎందుకంటే మా కాలేజీ లో అమ్మాయిలు వుండేవారు కాదు. నేత్రానందం కోసం కాకినాడ అండాలమ్మ కాలేజీ కి వెళ్ళవలసి వచ్చేది. జాబు చూస్తే ఫీల్డ్ వర్క్. మరీ బోర్ గా వుండేది. ఇక్కడా అలాగే ఉంటుందేమో అని నా భయం. ఓ.కే. పరవాలేదు అనుకొన్నాను.
ఇద్దరం రూము లో నుండి బయటకు వచ్చి, అక్కడే వున్న కంపెనీ కాంటీన్ లోకి వెళ్ళాము. రెండు టీలు చెప్పి(అప్పటికింకా చ్చాయ్ అనడం తెలియదు) ఎంత అన్నాను, అతను 20 పైసలు అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఎంత అని మళ్ళీ అడిగాను.అతను విసుగ్గా మొహం పెట్టి చాయ్ 10 పైసలు అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చాయ్ తాగి బయటకు వచ్చి సిగరెట్ ముట్టించాను. ఈ రోజు శనివారం, రేపు ఆఫీసు వుండదు.మళ్ళీ ఇల్లందు ఎందుకు, ఇటు నుండి కాకినాడ వెళ్ళిపోదాము అని నిర్ణయం తీసుకొన్నాను. నేను ఇల్లందు నుండి వచ్చేటప్పుడే, మా పిన్ని కి వెళితే నేను అటు నుండి కాకినాడ వెళతాను అని చెప్పి వచ్చాను. తరువాత ఇద్దరం ఒకరి గురించి ఒకరం అడిగి తెలుసుకున్నాము.అతను అంతకు ముందు రైల్వేలో చేసాను అని చెప్పాడు. నేను అప్పటికి ఫిషరీస్ కార్పోరేషన్, జిల్లా పరిషత్ ల్లో చేసి వున్నాను. అదేమిటి అందులో ఎందుకు మానేశారు అని అడిగాడు. అక్కడ నేను వర్క్ ఇన్స్పెక్టర్ని, ఇక్కడ సూపెర్వైజర్ కాడర్ కదా అన్నాను. అలా మాట్లాడు కుంటూ, ఇద్దరం పోస్ట్ ఆఫీసు సెంటర్ కి వచ్చాము. అప్పటికి 1 .00 అయ్యింది. ఇద్దరం కలసి భోజనం చేసాము.నా జీవితంలో అటువంటి భోజనం అదే మొదటిసారి.ఖర్మ మొదలైందిరా బాబూ అనుకొన్నాను.

No comments:
Post a Comment